ఆలోచనలను ప్రదర్శించడానికి యువ ఆవిష్కర్తలకు ఆహ్వానం
భవిష్యత్తు నిర్మించుకోవడానికి రూ.50 లక్షల వరకు నగదు పురస్కారాలు
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తలను ఆహ్వానించి, వారి ఆలోచనలను తెలుసుకుని, వాటికి రెక్కలిచ్చేలా దాదాపు 50 లక్షల రూపాయల నగదు పురస్కారాలతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇన్నోవేషన్ ఛాలెంజ్ (జీఐసీ) 2026 ఆరవ ఎడిషన్ ను నిర్వహించనుంది. గీతంలోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యార్థి వెంచర్ ఛాలెంజ్, ఆశాజనకమైన ఆలోచనలను ప్రభావవంతమైన, విస్తరించదగిన వెంచర్లుగా మార్చడానికి యువ ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
పాఠశాల (10 నుంచి 12 తరగతులు), అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను, 2025 నుంచి పట్టభద్రులైన వారిని నిజ ప్రపంచ సవాళ్లను పరిష్కరించే వినూత్న పరిష్కారాలను సమర్పించమని ఈ ఛాలెంజ్ ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో జూనియర్, సీనియర్ అనే రెండు విభాగాలున్నాయి. ఇవి నగదు బహుమతులు, నిపుణుల మార్గదర్శకత్వం, వెంచర్ కోచింగ్, ఇంక్యుబేషన్ అవకాశాలు, భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్ లోకి ప్రవేశాన్ని కల్పిస్తాయి.జీఐసీ 2026 ఒక క్రమబద్ధమైన ప్రయాణంలో ఆన్ లైన్ స్క్రీనింగ్, వర్చువల్ బూట్ క్యాంప్, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటివి ఈనెల 20, 21 తేదీలలో ఆన్ లైన్ సెమీ-ఫైనల్స్ తో ప్రారంభమైన డిసెంబరు 11న గీతం హైదరాబాదులో జరిగే జాతీయ గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది.
ఈ ఛాలెంజ్ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి (క్లైమేట్ టెక్), సుస్థిరత, వ్యవసాయం, ఫుడ్ టెక్, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, డీప్ టెక్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రీడలు, ఫిట్ నెస్, నేరుగా వినియోగదారులకు (డీ2సీ), ప్రజలు నేరుగా కొనుగోలు చేసి వినియోగించే ఉత్పత్తుల బ్రాండులు (కన్స్యూమర్ బ్రాండ్స్) వంటి కీలక అంశాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.పోటీతో పాటు జీఐసీలో పాల్గొనే వారికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల అగ్రనేతలు, అనుభవజ్జులైన మెంటర్ల (మార్గదర్శుల)తో సంభాషించే అవకాశాలు లభిస్తాయి. ఈ రివార్డులలో సీనియర్ ట్రాక్ లో రెండు లక్షల రూపాయల వరకు నగదు బహుమతులు, గీతం i-TBIలో ఆరు నెలల ఇంక్యుబేషన్ అవకాశాలుంటాయి. జూనియర్ ట్రాక్ ఫైనలిస్టుల కోసం లీడ్ ప్రోగ్రామ్ తో పాటు ఒక ఏడాది పాటు వ్యక్తిగతంగా వెంచర్ కోచింగ్ ఉన్నాయి.
ఇవేగాక, ఉత్తమ సామాజిక ప్రభావ వ్యాపార ఆలోచన అవార్డు, లెబెన్ జాన్సన్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు, డాక్టర్ జీవీవీ రావు యంగ్ ఇంజనీర్ డ్రీమర్ అవార్డులు వంటి ప్రత్యేక గుర్తింపులు కూడా ఉన్నాయి.భాగస్వాముల బలమైన నెట్ వర్కు మద్దతుతో ఐదు వేలకు పైగా స్టార్టప్ ఆలోచనలు, వందకు పైగా పిచ్ లు, 50కి పైగా జ్యూరీ సభ్యులు, 30కి పైగా భాగస్వాములు, 29 రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ఒకచోట చేర్చి, భారతదేశ విద్యార్థి ఆవిష్కరణ, వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే జీఐసీ లక్ష్యం.ఇందులో పాల్గొనాలని అభిలషించే వారు ఈనెల 7వ తేదీలోగా తమ పేర్లను జీఐసీ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం 90630 65811, 83283 34930 నంబర్లను సంప్రదించాలి లేదా gic@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలి.
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…
రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…
- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…