పటాన్చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ (ఎస్ఓపీ) ని 2021 లో అత్యంత ఆశాజనకమైన, ఉద్భవిస్తున్న ఫార్మశీ కళాశాల విభాగం కింద నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు-2021 తో సత్కరించింది. నాణ్యమైన విద్య, అత్యుత్తమ పాలన, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారని శుక్రవారం విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కూడా వర్చువల్ విధానంలో సజావుగా తరగతులు నిర్వహించినందుకు గాను వర్చువల్ గా జ్ఞానాన్ని పంచడంలో అత్యుత్తమ పనితీరు విభాగంలో మరొక అవార్డును కూడా ఇచ్చారని, ఇటీవల బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ అందుకున్నట్టు తెలియజేశారు.
ప్రపంచ ఫార్మశిస్ట్ దినోత్సవం…
భారతీయ ఫార్మశీ పట్టభద్రుల సంఘం (ఐపీజీఏ) తో కలిసి ప్రపంచ ఫార్మశీ దినోత్సవం-2021 ని స్కూల్ ఆఫ్ ఫార్మశీలో జరుపుకున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐపీజీఏ దక్షిణ భారత సమన్వయకర్త పూర్వ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ జి.కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నట్టు తెలిపారు. ప్రొఫెసర్ జీఎస్ కుమార్ స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి గీతం వీసీ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ సభాధ్యక్షత వహించారన్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ అధ్యక్షురాలు ఎస్.ఆదిలక్ష్మి, కర్ణాటక ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ రాజేష్ వెంకట్రామన్ ఆతిథ్య ఉపన్యాసాలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాకేష్, బారిక్, డాక్టర్ షినాయ్ సుగుణన్ సమన్వయకర్తలుగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.
మందుల కోసం భాద పడుతూ వ్యక్తి కి 5,000 వేలు ఆర్దిక సాయం ఎన్ఎంఎం యువసేన
నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…