politics

గీతం స్కాలర్ ఝాన్సీ రాణికి డాక్టరేట్ …

మన వార్తలు ,పటాన్ చెరు:

‘ క్లౌడ్లో మెరుగైన డేటాను పొందడంలో నియంత్రణ , గోప్యతను కాపాడే యంత్రాంగం ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిశోధక విద్యార్థిని పరిటాల ఝాన్సీరాణిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.అక్కలక్ష్మి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ఈ సిద్ధాంత వ్యాసంలో , క్లౌడ్ డేటాకు భద్రతను అందించడానికి క్లౌడ్లో సమర్థవంతమైన డేటా యాక్సెస్ నియంత్రణ , గోప్యతను సంరక్షించే యంత్రాంగాన్ని పరిశోధించి , ప్రతిపాదించినట్లు ఆమె తెలిపారు . డైనమిక్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ ( డీఏఈఎస్ ) ద్వారా డేటాను ఎన్క్రిప్ట్ చేశామని , ప్రతిపాదిత అల్గోరిథం ఐదు కీలక పరిణామాలను కలిగి ఉన్నాయని , కీ పరిమాణం యాదృచ్చికంగా ఎంపిక చేయబడుతుందని , డేటా భద్రతా సమస్యలను తగ్గిస్తుందని పేర్కొన్నారు .

కీ పొడవును ఎంపిక చేశాక , డేటా యజమాని కీలక అభ్యర్థనలను సంపుతారన్నారు . పొందిన కీ పరిమాణం ఆధారంగా , డేటా యజమాని సాక్షిక రహస్య కీని ఉత్పత్తి చేస్తాడని , ఈ కీ క్లౌడ్ డేటాబేస్లో నిల్వ చేస్తారని ఆమె తెలిపారు . వినియోగదారు డేటాను అభ్యర్థిస్తే , క్లౌడ్ డేటాబేస్ నుంచి నిల్వచేసిన కీ వినియోగదారుకు అందుతుందని , వారు కీతో ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలను చేస్తే , దానిని ఉపసంహరించుకో వచ్చన్నారు .

అలాగే క్లౌడ్ అడ్మిన్ ద్వారా వినియోగదారు ప్రవర్తన పర్యవేక్షించొచ్చని , లీక్ అయిన కీని క్లౌడ్ అడ్మిన్ కూడా ఉపసంహరించుకోవచ్చని ఆమె తెలిపారు . ఝాన్సీరాణి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హెదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇంజనీరింగ్ డెరెక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించారు .

Ramesh

Recent Posts

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

21 hours ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

21 hours ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

21 hours ago

ఎన్ జీ ఓ మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు…

21 hours ago

వియత్నాంలో ఏఐ శిక్షణ ఇస్తున్న గీతం అధ్యాపకుడు

వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…

24 hours ago

60 లక్షల రూపాయలతో ఇంద్రేశం రహదారి మరమ్మతులు

అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :…

1 day ago