మన వార్తలు , హైదరాబాద్
లాక్‌డౌన్ కారణంగా స్కూల్ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. దీంతో మూడ్రోజులకోసారి డయాలసిస్ తప్పనిసరైంది. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు దొరికిన చోటల్లా అప్పులు చేశారు.
అయితే చివరగా చేసిన డయాలసిస్ చేసే సమయంలో అతని ఆరోగ్యం మరింత విషమించింది. కుమారుడికి కిడ్నీ ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో తమకెవరైనా సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.
ఈ విషయాన్ని ఒక నెటిజన్ గమనించి, తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. సర్ ఈ పిల్లాడికి ఏమైనా సాయం చేయండి అని వేడుకున్నాడు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా వెంటనే స్పందించిన కేటీఆర్.. ఈ సమస్యను తాము చూసుకుంటామని చెప్పారు. నిమ్స్ ఆస్పత్రి వర్గాలతో కలిసి ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…