Districts

బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యం : ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్

మనవార్తలు , పటాన్ చెరు:

బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యంమని ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్ అన్నారు బుధవారం ఇస్నాపూర్ లోని స్కేర్ ఇన్ హోటల్ లో ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బిట్ల మహేష్ అధ్వర్యంలోభారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అలె భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ కుటుంబపాలన జరుగుతుందని అన్నారు బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యం అన్నారు.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన టీఆర్‌ఎస్‌ సర్కారు వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలను అణిచివేస్తున్నారని, బీసీల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అలె భాస్కర్ డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నరెందర్ రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,రాష్ట్ర కార్యదర్శి సురెందర్, ప్రచార కార్యదర్శి నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Ramesh

Recent Posts

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

21 hours ago

మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…

21 hours ago

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి  నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…

21 hours ago

యుక్తితో, నేర్పుగా వ్యవహరించాలి

ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…

21 hours ago

గీతంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) హైదరాబాదులోని లైఫ్ సైన్స్ విభాగం ‘ఆహార శుద్ధి…

21 hours ago

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 days ago