Telangana

గీతమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు

– వివరాలు సేకరించిన విద్యార్థులు

మనవార్తలు ,పటాన్ చెరు:

హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ ఆప్షన్స్ ( ఓసీవో ) ల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు . గీతం విద్యార్థులు , వారి తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ , ఉపకార వేతనాలు , కోర్సులు , వసతి సౌకర్యం , ఇతర విలువ ఆధారిత ప్రయోజనాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు ఆయన వివరించారు . తొలుత , విదేశీ వర్సిటీల ప్రతినిధులు గీతం ఉన్నతాధికారులతో , ఆ తరువాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి , ఒకరిని మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు వేణుకుమార్ తెలిపారు . ఓసీవో డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ రవికాంత్ స్వాగతోపన్యాసం చేయగా , నరేష్ గుండోజు వందన సమర్పణతో ముఖాముఖి ముగిసిందన్నారు .

ఆ తరువాత ఫెయిర్ను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించినట్టు తెలిపారు . యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , సదరన్ కాలిఫోర్నియా , ఇల్లినాయిస్ ( చికాగో – స్ప్రింగ్ఫీల్డ్ ) డేటన్ , మసాచుసెట్స్ , డూండీ , స్ట్రాల్రెడ్ , యార్క్ నాటింగ్హామ్ వర్సిటీలతో పాటు న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజెన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పాల్గొన్నట్టు డాక్టర్ వేణుకుమార్ వివరించారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago