Telangana

గీతము నాక్ ఏ++ గ్రేడు….

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అత్యుత్తమ విద్యకు చిరునామాగా మారిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘నాక్ ఏ++’ గ్రేడు (4 పాయింట్లకు గాను 3.54) సాధించి మరోసారి తన సత్తాను చాటుకుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ లేదా నాక్) గీతం పనితీరును విశ్లేషించి ‘ఏ++’ గ్రేడును కేటాయించిందని, ఇది ఏడేళ్ల పాటు అమలులో ఉంటుందని ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశంలోని దాదాపు 4,201 ఉన్నత విద్యా సంస్థలలో కేవలం మూడు శాతానికి మాత్రమే ఈ గ్రేడు దక్కినట్టు నాక్ వెబ్సైట్ ద్వారా వెల్లడవుతోందన్నారు.’నాక్ ఏ++’ గుర్తింపు పొందిన గీతం మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, ప్రపంచ స్థాయి, సమగ్ర విద్యను అందించడంతో పాటు సమాజానికి దోహదపడాలనే దాని లక్ష్యానికి కూడా దగ్గరయినట్టు ఉపకులపతి పేర్కొన్నారు. ఈ గ్రేడు సాధించడం ద్వారా మరింత స్వయం ప్రతిపత్తిని సమకూర్చే కేటగిరీ-1 హోదాను కూడా గీతం నిలుపుకుందన్నారు. అకడమిక్స్ ప్రోవీసీ ప్రొఫెసర్ జయశంకర్ ఇ వారియర్, ఐక్యూఏసీ డెరైక్టర్ ప్రొఫెసర్ రాజా ప్రభులతో సహా ఈ ఘనత సాధించిన సిబ్బంది, విద్యార్థులు, ఇతర భాగస్వాములందరికీ ప్రొఫెసర్ దయానంద అభినందనలు తెలియజేశారు.గతంలో, గీతం 2011లో ‘నాక్-ఏ’ గ్రేడు, 2017 ‘నాక్ – ఏ+’ గ్రేడు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago