పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని విజువల్ కమ్యూనికేషన్స్ బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థిని భావరాజు నందిని న్యూఢిల్లీలో జనవరి 26న నిర్వహించిన 75వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల సాంస్కృతిక ప్రదర్శనలో తన ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని ఆమె అధ్యాపకురాలు సంధ్యా గాండే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన అతిథులు, పలువురు రాయబారులు, పౌర, సైనిక ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో గీతం విద్యార్థిని పాల్గొని, తన కళా నెపుణ్యాన్ని ప్రదర్శించడం ఓ మరుపురాని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. ఆమె కళాభినయానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయని, ఇది గీతమ్ లో పెంపొందించిన సాంస్కృతిక చైతన్యం. కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకలలో ఎన్ సీసీ కేడటగా కళాభినయాన్ని ప్రదర్శించే అనకాశం అందుకున్న భావరాజు నందినిని గీతం,హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్, పలువురు విభాగాధిపతులు, ఆధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించినట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక కార్యక్రమానికి నందినిని సిద్ధం చేయడంలో తనవంతు సహకారం అందించినట్టు అధ్యాపకురాలు సంధ్యా గాండే ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…