Telangana

అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో గీతం విద్యార్థికి కాంస్య పతకాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది బీ.టెక్. (సీఎస్ఈ) విద్యార్థి ఎస్.వీరంద్ర ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అరీనాలో నిర్వహించిన ఐదవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-2026 పోటీలలో రెండు కాంస్య పతకాలు సాధించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాపు పది దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. సీనియర్ కేటగిరీలో పోటీపడిన వీరంద్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయనతో పాటు తెలంగాణ బృందంలోని ఇతర సభ్యులు కూడా ప్రతిభ కనబరచి కిక్ లైట్, లైట్ కాంటాక్ట్, జూనియర్ విభాగాలలో బంగారు, వెండి పతకాలను గెలుచుకున్నారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. నారాయణరావు చౌదరి తదితరులు వీరంద్ర సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించడానికి కృషి చేయమని ప్రోత్సహించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago