Telangana

ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో గీతం ప్రాతినిధ్యం

-లండన్ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొని, ప్రసంగించిన ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్

-పరిశోధనా పత్రాన్ని సమర్పించి అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలందుకున్న గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ ఇటీవల లండన్ లో నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సదస్సులో విశిష్ట అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఈ విషయాన్ని గీతం వర్గాలు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.యునైటెడ్ కింగ్డమ్ (లండన్)లో ఈ నెలలో (జూన్) జరిగిన 13వ అంతర్జాతీయ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ థియరీ అండ్ అప్లికేషన్స్ (FICTA-2025) సదస్సులో ఆమె గీతంకు ప్రాతినిధ్యం వహించినట్టు తెలియజేశారు. లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ అండ్ డీఎస్) పరిశోధనా బృందం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ లో ఎదురయ్యే సవాళ్లు, వాటి వినియోగంపై గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ పర్వేకర్ కీలకోపన్యాసం చేశారన్నారు. విభిన్న పరిశ్రమలలో ఏఐ-ఎంఎల్ యొక్క క్లిష్టమైన పురోగతులు, వాస్తవ-ప్రపంచ వినియోగాలను ఆమె వివరించినట్టు తెలిపారు.సెర్బియాలోని సింగిడునమ్ విశ్వవిద్యాలయంలో ఆతిథ్య ఉపన్యాసకురాలిగా కూడా సేవలందిస్తున్న ప్రొఫెసర్ పర్వేకర్, అంతర్జాతీయ విద్యాపరమైన సంబంధాలు, సహకారాలకు ఊతమిస్తోందన్నారు. ప్రొఫెసర్ పర్వేకర్ మార్గదర్శనంలో సీఎస్ఈ చివరి ఏడాది విద్యార్థులు జి.సోహన్ కుమార్ రెడ్డి, ఆదిచేతన్ ఖోట్, టి.ఆశ్రిత్, బి.మణిచరణ్ రెడ్డి తదితరులు ఈ-కామర్స్ సైట్ల కోసం ఆటోమేటిక్ ధర పర్యవేక్షణ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్టు తెలియజేశారు. ఈ పత్ర రూపకల్పన కోసం వారు చేసిన కృషి, దాని ఔచిత్యం, అందులోని ఆవిష్కరణలు అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు పొందాయన్నారు.ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలో గీతం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధన, ఆవిష్కరణ, ప్రపంచ విద్యా కార్యకలాపాలలో రాణించడం గీతం యొక్క నిబద్ధతను ప్రస్ఫుటీకరిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

19 hours ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

19 hours ago

నాగార్జున ఉన్నత పాఠశాలలో మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచిత టైలరింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…

19 hours ago

ఘనంగా హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…

19 hours ago

కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు

– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్‌ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…

19 hours ago

న్యూలాండ్ లేబొరేటరీస్‌లో జాతీయ భద్రతా వారోత్సవాల వేడుకలు

భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…

19 hours ago