ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీలను సందర్శించి, మనదేశ నిర్మాణ వారసత్వ పరిశీలన
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మూడవ ఏడాది విద్యార్థులు రెండు వారాల పాటు ఉత్తర భారతదేశంలో విద్యా అధ్యయన పర్యటనను చేశారు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంగణాల ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీ వంటి చారిత్రాత్మక నగరాలను పర్యటించి, భారతదేశ గొప్ప నిర్మాణ వారసత్వాన్ని లోతుగా పరిశీలించారు. ఈ విషయాన్ని ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జాగ్రత్తగా రూపొందించిన ఈ పర్యటన విద్యార్థులకు మొఘల్ వైభవం నుంచి రాజపుత్ క్లిష్టత, సమకాలీన ఆవిష్కరణల వరకు విభిన్న శ్రేణి నిర్మాణ శైలులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది.
ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం, జైపూర్ లోని అయోజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో విద్యా మార్పిడి. అక్కడి విద్యార్థులతో ఆలోచనలను రేకెత్తించే చర్చలు, సహకార అభ్యాసంలో పాల్గొని, అంతర్-సంస్థాగత జ్జాన భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నారు.ఆ తరువాత, జైసల్మేర్ లోని రాజకుమారి రత్నవతి బాలికల పాఠశాల సందర్శన అద్భుతమైన అనుభవాలలో ఒకటి. ఇది స్థిరమైన నిర్మాణ శైలికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. స్థానిక బాలికలను విద్య ద్వారా శక్తివంతం చేయడానికి రూపొందించబడిన ఈ సంస్థ, పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్ యొక్క పరివర్తన ప్రభావాన్ని చూపడమే గాక, సామాజిక మార్పును నడిపించడంలో వాస్తు శిల్పం పాత్రను విశదీకరిస్తోంది.తరగతి గది అభ్యాసానికి మించి, ఈ అధ్యయన పర్యటన విద్యార్థులకు సాంప్రదాయ, ఆధునిక నిర్మాణ పద్ధతులపై సమగ్ర దృక్పథాన్ని అందించింది.
సమకాలీన అనువర్తనాలతో చారిత్మక అంతర్దృష్టులను అనుసంధా నించడం ద్వారా, ఈ ప్రయాణం వారి విద్యా కార్యకలాపాలను సుసంపన్నం చేసింది. సంస్కృతి, సమాజాలపై వాస్తుశిల్పం యొక్క లోతైన ప్రభావం పట్ల వారిలో ఆలోచనలను రేకెత్తించింది.ఈ స్వీయ పరిశీలానుభవం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ఆచరణాత్మక అభ్యాసం, విశ్వశ్రేణి అవగాహనలపై దాని నిబద్ధతను చాటి చెబుతోంది. జ్జాన దృష్టితో భవిష్యత్తును రూపొందించే, ముందు చూపుతో యోచించే వాస్తుశిల్పులుగా మారడానికి విద్యార్థులను సిద్ధం చేస్తోంది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…