Telangana

మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ని ప్రారంభించిన గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

నూతన వ్యాపార, ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారానే స్థానిక ప్రజలకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందుతాయని బీఆర్ఎస్ ఇంఛార్జ్  మాజీ జెడ్పీటీసీ గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యాపార, ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌జ‌లుక నాణ్య‌మైన సేవ‌ల‌తో పాటు  ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని ఆకాంక్షించారు. కొత్త సంస్థ‌లు ఏర్పాటు కావ‌డం వ‌ల్ల స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తాయ‌ని, ప్రజలు రుణాలు, పొదుపు పథకాలు ,ఇతర బ్యాంకింగ్ సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంద‌న్నారు. మ‌ణ‌ప్పురం ఫైనాన్స్ సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపడంతో పాటు సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బబుల్ రెడ్డి ,ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మచ్చ కిషోర్ రెడ్డి ,కో ఆప్షన్ సభ్యులు బాబా నిజముద్దీన్ ,బీఆర్ఎస్ నాయకులు వీరేష్ గౌడ్ రు,లక్ష్మణ్ గౌడ్ ,సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago