Telangana

కోకాపేటలో మాజీ మంత్రిని కలిసిన గడీల శ్రీకాంత్ గౌడ్

హరీశ్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్ర అభివృద్ధి–ప్రజా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు హరీశ్ రావు కి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గురువారం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు 2026 సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే రానున్న రోజుల్లో చేపట్టాల్సిన ప్రజాప్రయోజన కార్యక్రమాలపై స్నేహపూర్వకంగా, సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజల మౌలిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.దీనికి స్పందించిన గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, పటాన్ చెరు ప్రాంత ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత వేదికలపై ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులోనూ పార్టీ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏరోళ్ల శ్రీనివాస్, శివకుమార్, మఠం భిక్షపతి, అభిలాష్, కర్నాటి విద్యాసాగర్, మేరాజ్ ఖాన్, రామకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago