హరీశ్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర అభివృద్ధి–ప్రజా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు హరీశ్ రావు కి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గురువారం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు 2026 సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ భేటీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే రానున్న రోజుల్లో చేపట్టాల్సిన ప్రజాప్రయోజన కార్యక్రమాలపై స్నేహపూర్వకంగా, సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజల మౌలిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.దీనికి స్పందించిన గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, పటాన్ చెరు ప్రాంత ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత వేదికలపై ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులోనూ పార్టీ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏరోళ్ల శ్రీనివాస్, శివకుమార్, మఠం భిక్షపతి, అభిలాష్, కర్నాటి విద్యాసాగర్, మేరాజ్ ఖాన్, రామకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…