మనవార్తలు , అమీన్పూర్:
పటాన్ చెరు నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన రాధా కృష్ణ స్వామి, ఆలయ జీవ ద్వజ, శిఖర ఆంజనేయ, గరుడ, శివాలయ ప్రతిష్టాపన మహోత్సవం లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. దైవచింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న నూతన కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్, సింఫనీ హోమ్స్ కాలనీ లో ప్రజల కోసం కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేయనున్న మంచినీటి పైపు లైన్ నిర్మాణ పనులకు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు సాగునీటి , మంచినీటి పథకాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించాలి అనే ఏకైక లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా సమస్యలను తెలుసుకొని, త్వరతగతిన వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఆయా కాలనీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…