Telangana

జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర మహాసభల విజయవంతం సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కృతజ్ఞత సభ నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఐ జే యు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు రమణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ శాలువా, మెమొంటోతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేయడంతో పాటు, దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

పటాన్చెరు నియోజకవర్గంలోనూ జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 100 మంది జర్నలిస్టులకు 15 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య భద్రత కార్డులు అందించడంతోపాటు, ఇళ్ల స్థలాలను సైతం అందించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.వాస్తవమైన వార్తలు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు.జాతీయ మహాసభలకు పటాన్చెరును వేదికగా ఎంపిక చేసుకొని సభలను విజయవంతం చేయడం పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.భవిష్యత్తులోనూ జర్నలిస్టులు చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో యూనియన్ జిల్లా, నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

4 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

4 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago