Telangana

అంబేద్కర్ అందరివాడు_చిట్కులు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

 జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :

జిన్నారం మండలం రాళ్లకత్వ తన సొంత నిధులతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చిట్కులు సర్పంచ్ నీలం మధు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే మొట్టమొదటి అని అన్నారు .దాంతో పాటు నిర్మించిన సెక్రటేరియట్ కు అంబేద్కర్ విగ్రహం నామకరణం చేయడం గొప్ప విషయం అన్నారు.అంబేద్కర్ అందరివాడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాటి చెప్పారన్నారు .కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని  ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని , ఎంతకాలం బ్రతికామన్నది కాదని ప్రజలతో ఆదరణ పొందే విధంగా ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని ఆయన తెలిపారన్నారు. అంబేద్కర్ ను ఉన్నతంగా నిలిపి, సముచిత గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో ఒక గొప్ప మహా వ్యక్తిగా నిలిచిపోతారని ఆయన తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం నుంచి రాళ్లకత్వ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు,

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాయిని రమమల్లేష్, ఉప సర్పంచ్ గణేష్, ముత్తాంగి మాజీ పిఎసిఎస్ చైర్మెన్ నారాయణ రెడ్డి, వెంకటేష్,మెట్టు కృష్ణ యాదవ్,అన్వర్ పటేల్, ఎకె ఖాన్,శ్రీనివాస్, మాణిక్యం, గారెల మల్లేష్,గోపాల్,శంకర్,మహేష్, గ్రామ పెద్దలు, ప్రజలు, అంబేద్కర్ సంఘం నాయకులు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago