politics

పటాన్చెరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటునకు శంకుస్థాపన

_త్వరలో గౌడ కులస్తుల కోసం 500 గజాల స్థలం

_ప్రభుత్వ సంక్షేమం పథకాల్లో ప్రాధాన్యత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గౌడల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో బహుజనుల యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపైన పటాన్చెరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత నిధులతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. అతి త్వరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ గౌడ కులస్తులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో గౌడ కులస్తుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి రూ.2,016 పింఛన్‌ ఇస్తున్న రాష్టం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. చెట్టు పన్నులను రద్దు చేసి గీత కార్మికులకు అండగా ఉన్నది సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు.వైన్‌ షాపుల నిర్వహణలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌడ వర్గాలకు వ్యాపార అవకాశం కల్పినంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో గౌడ కులస్తుల కోసం అతి త్వరలో 500 గజాల స్థలాన్ని కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. పాపన్న ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రమోద్ గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు వెంకటేష్ గౌడ్, రాజు గౌడ్, ధన్ రాజ్ గౌడ్, ప్రతాప్ కృష్ణ గౌడ్, టింకు గౌడ్, వేణు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దుర్గయ్య గౌడ్, సుధాకర్ గౌడ్, విజయకుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago