_త్వరలో గౌడ కులస్తుల కోసం 500 గజాల స్థలం
_ప్రభుత్వ సంక్షేమం పథకాల్లో ప్రాధాన్యత
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గౌడల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో బహుజనుల యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపైన పటాన్చెరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత నిధులతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. అతి త్వరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆవిష్కరిస్తామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ గౌడ కులస్తులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో గౌడ కులస్తుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి రూ.2,016 పింఛన్ ఇస్తున్న రాష్టం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. చెట్టు పన్నులను రద్దు చేసి గీత కార్మికులకు అండగా ఉన్నది సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు.వైన్ షాపుల నిర్వహణలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌడ వర్గాలకు వ్యాపార అవకాశం కల్పినంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో గౌడ కులస్తుల కోసం అతి త్వరలో 500 గజాల స్థలాన్ని కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. పాపన్న ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రమోద్ గౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు వెంకటేష్ గౌడ్, రాజు గౌడ్, ధన్ రాజ్ గౌడ్, ప్రతాప్ కృష్ణ గౌడ్, టింకు గౌడ్, వేణు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దుర్గయ్య గౌడ్, సుధాకర్ గౌడ్, విజయకుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…