_25న సికింద్రాబాద్ లో పారంభించనున్న సినీ నటి ప్రణీత
_లోగో విడుదల చేసిన ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి
మనవార్తలు ,హైదరాబాద్:
ఆధునిక పద్దతుల ద్వారా సులభతరంగా సంతాన సాఫల్యం పొందవచ్చని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి అన్నారు. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం నిరీక్షిస్తున్న మహిళలను కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎంతో ఆడుకుంటున్నాయని చెప్పారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని, మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు. ఈనెల 25వ తేదీన వరల్డ్ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో ప్రముఖ సినీ నటి ప్రణీత ఈ ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఇందుకు సమబంధించిన లోగోను శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృత్వం ఒక వరం. ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం. మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి, పిల్లలు లేని సమస్య ప్రబలంగా ఉన్నాయి. ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్ పిల్లలు లేని కారణాలను సరైన రోగ నిర్ధారణ ద్వారా ఆధునిక వైద్య విధానాల సహాయంతో వైద్య శాస్త్రంలో తాజా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం ద్వారా ఈ కీలకమైన సమస్యను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఈనెల 25వ తేదీన వరల్డ్ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫర్టీ 9 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ పద్దతులపై మహిళలకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఫర్టీ 9 బ్రాంచ్ లలో మహిళలు వినియోగించుకోవచ్చని తెలిపారు. కొన్ని వేలమందికి ఐ వి ఎఫ్, ఐ సి ఎస్ ఐ, ఐ ఏం ఎస్ ఐ , ఉచిత వైద్య శిబిరాలను పలు ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహించినట్లు వివరించారు. ఇతర వివరాల కోసం 95504 00445 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…