Telangana

గంగా జమూన తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక మాజీ కోఆప్షన్ మెంబెర్ మొహమ్మద్ బషీర్ ఖురైషి

మనవార్తలు ప్రతినిధి , అమీన్‌పూర్ :

రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అమీన్‌పూర్ మాజీ కో ఆప్షన్ మెంబర్ బషీర్ ఖురైషి అన్నారు.రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కృష్ణారెడ్డి పెట్ ఈద్గాలో
ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో బషీర్ ఖురైషి పాల్గొన్నారు.ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ప్రార్ధనలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చి ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా బషీర్ అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో ప్రార్ధనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.రంజాన్ పండుగ లౌకికవాదానికి,మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయి’ బషీర్ ఖురేషి చెప్పారు.గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని,ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు_  ఐలాపూర్ మాణిక్ యాదవ్ 

రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి,సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సాయంత్రం నమాజ్‌ ఆచరించుకోవడానికి వెసులుబాటు కల్పించిందని అన్నారు.మసీదులు,ఈద్గాల అభివృద్ధికి,మరమ్మతులకు కెసిఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు దుస్తుల పంపిణీలతోపాటు ఇఫ్తార్‌ విందులు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
వారితోపాటు మాజీ ఉపసర్పంచ్ మొహమ్మద్ ఫహీం,, ఖమర్
అంజద్, మోయిన్, షేక్ సలీం, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

12 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

12 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

12 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

12 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

23 hours ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago