పటాన్‌చెరు ఏపీఆర్ లగ్జూరియా కమ్యూనిటీలో రామాలయ నిర్మాణ పనుల పరిశీలన
నూతన దేవాలయం నిర్మాణాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం
ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయం దేవాలయాల నిర్మాణానికి 75 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. బుధవారం ఉదయం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు గుర్తు చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…