-పటాన్‌చెరులో గుప్పుమంటున్న గ్రూపు రాజకీయాలు
-సీరియస్ తీసుకున్న పార్టీ అధిష్టానం?
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే పార్టీకి చెందిన వారు చింపిన వ్యవహారం కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న నేతలు.. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. రామచంద్రపురం లోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ “సర్” పై ‘బి ఎల్ ఏ’ లకు అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, బడా నేతలు విచ్చేస్తున్నందున వారి స్వాగతం కోసం స్థానిక కాంగ్రెస్ నేత శాపురం నరసింహారెడ్డి బాలాజీ కన్వెన్షన్ ముఖ ద్వారంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. వాటిని కాంగ్రెస్ పార్టీ సొంత నాయకులే చింపేశారు. ఈ చర్యకు సొంత పార్టీ వారే పాల్పడ్డారంటూ ఒక వర్గం నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన నేతలకు ఫ్లెక్సీలు, కటౌట్లు చింపడం మరింత మనస్థాపానికి గురిచేసింది. దీంతో ఈ వ్యహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు పోవడానికి ఆ వర్గం నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫ్లెక్సీల వ్యవహారంతో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. ఈ విషయమై అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకుంటుందా? ఫ్లెక్సీల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించ లేదంటూ స్వయాన నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ బహిరంగంగా ఆరోపణ చేయటంతో పాటు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నేతల మధ్య సమన్వయం, సఖ్యత లేని కొరణంగా ఇలాంటి పరిస్థితులు తలేత్తుతున్నాయని కొందరు నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయలను ప్రొత్సహిస్తున్న నేతల కారణంగా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. కుల రాజకీయాలతో కొందరు చిచ్చు పెడుతుండగా.. ఆధిపత్యం కోసం మరి కొందరు పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్స హిస్తూన్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కాగా ఇక్కడ వార్డు నేతకూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుని పెత్తనం చెలాయిస్తున్నందున ఈ పరిస్థితి దాపురించిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం _శాపురం నరసింహా రెడ్డి
40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఒక సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న ఓర్వలేక నా ఫ్లెక్సీ చింపారు. నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ముందు ఉండి మరి ఫ్లెక్సీ చింపించారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి కానీ.. ఫ్లెక్సీలు చింపే సంప్రదాయం మానుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తూ ముందుకు సాగుతున్నామని.. వ్యక్తిగత నిర్ణయాలు, పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…