Telangana

ఓటర్ల జాబితా సవరణ పై బి.ఎల్.ఎలు అప్రమత్తంగా ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరులో ఏస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కు నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.బుధవారం పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం బాలాజీ గార్డెన్స్ లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముసాయిదా సవరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, సదస్సును ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా మార్పులు చేర్పులు జరగాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే క్రమంలో పొరపాట్లు జరగకుండా చూసే బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ల పై ఉందన్నారు.

మరణించిన వారి పేర్లు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న బోగస్ ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయాలని అధికారులకు, ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అలాగే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చొరవ చూపాలని పిలుపునిచ్చారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ‘ఎస్ ఐ ఆర్’ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలని, ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఓలతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు.

ప్రజల్లో కూడా ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించి, తమ ఓటు వివరాలను సరిచూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.ఈ అవగాహన సదస్సులో ఎస్ ఐ ఆర్ ఫారాల భర్తీ, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిశీలన, తదితర సాంకేతిక అంశాలపై ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ వెన్నెల, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాట సుధా, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago