Telangana

గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తన విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచించే 17వ పట్టభద్రుల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్ డే)ను ఆగస్టు 1, 2026న (శనివారం) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.2025-26 విద్యా సంత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్.డీ. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఈ పట్టభద్రలు ప్రదానోత్సవంలో పాల్గొనడానికి అర్హులని తెలియ జేశారు. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ వంటి వివిధ విభాగాలకు చెందిన పట్టభద్రులు తమ విద్యాపరమైన విజయాలను వేడుకగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం వేదిక కానుందన్నారు.అర్హులైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 2026, జూలై 3 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేర్ల నమోదు (రిజిస్ట్రేషన్), స్నాతకోత్సవానికి సంబంధించిన సమగ్ర వివరాలు, మార్గదర్శకాల కోసం విద్యార్థులు గీతం అధికారిక వెబ్ సైట్ www.gitam.edu ను సందర్శించాలన్నారు.తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలలో తదుపరి దశను ప్రారంభించబోతున్న విద్యార్థులకు, యూనివర్సిటీ నాయకత్వం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రముఖ అతిథుల సమక్షంలో తమ విద్యాపరమైన విజయాలను గుర్తుచేసుకునే అవకాశాన్ని ఈ పట్టభద్రుల ప్రదానోత్సవం కల్పిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago