Telangana

ఐదు విజయాలు కేసిఆర్ గారికి పుట్టినరోజు కానుక

ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం

మీ వెనుక నేనున్న.. అభివృద్ధిలో ముందుకు సాగండి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి

నూతన మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందన సందేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా అందించామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఇందుకు సహకరించిన కార్యకర్తలకు సంపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో ఇటీవల నూతనంగా ఎన్నికైన గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులందరూ ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి సంక్షేమాల అంశంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఇందుకు తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేద్దామని తెలిపారు.ప్రతిపక్షంలో ఉన్నప్పటికిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై పటాన్చెరు ప్రజలు ఎల్లప్పుడూ తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని ఇందులో భాగంగా ఐదు మున్సిపాలిటీలలోనూ. బిఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago