– జాతీయ గణిత దినోత్సవంలో శ్రీవేదభారతి చీఫ్ డాక్టర్ అవధానులు స్పష్టీకరణ
మనవార్తలు ,పటాన్ చెరు:
సున్నా , దశాంశ సంఖ్య , బెనైరీ సంఖ్యలు , ప్రోగ్రెషన్ , ఇన్ఫినిటీ ( అనంతం ) వంటి ఐదు గొప్ప ఆవిష్కరణలను మన భారతీయులే చేశారని శ్రీవేదభారతి ముఖ్య నిర్వహణాధికారి , నిమ్స్ కంప్యూటర్ విభాగం పూర్వ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ అవధానులు చెప్పారు . గణితశాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతియేటా డిసెంబర్ 22 న నిర్వహించే ‘ జాతీయ గణిత దినోత్సవాన్ని ‘ గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు . స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని గణితశాస్త్ర విభాగం నిర్వహించిన ఈ స్మారక కార్యక్రమంలో డాక్టర్ అవధానులు ప్రాచీన భారతదేశంలోని గణితశాస్త్ర ఆవిష్కరణలపై ప్రసంగించారు .
భారత ఉపఖండంలో గణితానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉందని , ప్రాచీన భారతీయ గణిత శాస్త్రాలన్నీ సంస్కృతంలో సూత్రాల విభాగం రూపంలో ఉన్నాయని , వాటిలో నియమాలు లేదా సమస్యలను పేర్కొన్నట్టు ఆయన చెప్పారు . ఆర్యభట , వరాహమిహిర , భాస్కర -1,2 , విష్ణుగుప్త , సిద్దసేన , మణిత , శ్రీజిధ్వజ , కళ్యాణవర్మ , సింహతిలకసూరి , కాలకాచార్య , మహావీరాచార్య , భటోత్పల , దేవస్వామి , సత్యాచార్యా , జీవశర్మ వంటి పండితులు గణితంలో విలువెన రచనలు చేసినట్టు డాక్టర్ అవధానులు వివరించారు . ఈ సందర్భంగా ‘ వేద గణితం – యంత్ర అభ్యాసం ( మెషీన్ లెర్నింగ్ ) ‘ అనే అంశంపై స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ ప్రసంగించారు .
మెషీన్ లెర్నింగ్ ఎక్కువగా గణిత , గణాంక శాస్త్రాలపై ఆధారపడి ఉందన్నారు . గణితశాస్త్రం మన జీవితంలో ఒక భాగమని , ఆలోచనలో తర్కాన్ని ఇస్తుందని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తన స్వాగతోపన్యాసంలో చెప్పారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , ప్రొఫెసర్ బీఎం నాయుడు , డాక్టర్ వంశీకృష్ణతో పాటు పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . గోడపత్రికల రూపకల్పన , గణిత ఫజిల్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు . డాక్టర్ కె.కృష్ణ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…