అమీన్ పూర్ లో ఏ.బీ.జే.ఎఫ్ సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం
మనవార్తలు , అమీన్ పూర్:
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ లో అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా కు సంబంధించిన కార్యవర్గ సమావేశాన్ని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టులు సమావేశమయ్యారు.
దీనికి అధ్యక్షత వ్యవహరించిన సురేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లే విధింగా ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని ఏ. బీ. జే .ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వీ సురేష్ కుమార్( V10 tv ) ఛైర్మెన్ తెలిపారు .రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ. బీ. జే .ఎఫ్ ను విస్తరింపాజేయాలని సభ్యులందరికి సూచించారు .అనంతరం సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .
ఈ సమావేశంలో ఏ బీ జే ఎఫ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కొమ్ముగురీ ప్రదీప్ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సునిల్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ సంస్థను జర్నలిస్టుల ఐక్యత తో బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగరెడ్డి జిల్లా సెక్రెటరీ అఖిల్ , హరి ప్రసాద్, రవి , హరి, అనిల్, మనీష్, భారత్, సాయి కిరణ్, రఘు నాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…