మనవార్తలు , పటాన్ చెరు:
క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సహకారంతో ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని చిట్కుల్ సర్పంచి నీల మధు ముదిరాజ్ తెలిపారు. రామచంద్రాపురానికి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ హరిబాబు పిల్లలు కారుణ్య, హర్షవర్ధన్‌లు రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడళ్లు సాధించిన సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శాలువాకప్పి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారుల ఉన్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు.
ఓపెన్ కేటగిరిలో కారుణ్య ఈనెల 18 నుంచి 20 తేదీ వరకూ అత్తాపూర్‌లో 3 వ సర్ధార్ వల్లభాయి పటేల్ మహిళా రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుని, గోల్డ్‌మెడల్ సాధించడం గర్వకారణం అన్నారు. అలాగే హర్షవర్థన్ నవంబర్ 29 న అండర్ 15 విభాగంలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో 52 కేజీల కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించాడని తెలిపారు. అంతేకాక ఈనెల 15, 16 తేదీల్లో జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన నేషనల్ ఓపెన్ కేటగిరిలో జాతీయ స్థాయి పోటీల్లో 5 స్థానం గెలుచుకున్నారని, ఇలాంటి పిల్లలను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. క్రీడలకు, క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తుంటానని నీల మధు ముదిరాజ్ తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…