Telangana

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

ఈనెల 30న కళాశాలల బహిష్కరణ

బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడొద్దని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ అన్నారు. శుక్రవారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు యాజమాన్యాలు సర్టిఫికెట్ లు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిజు బకాయలు చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్ గద్దెనెక్కిన తరువాత 10వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకు మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జీవో నెం 8,9 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈనెల 30న కళశాలల తరగతుల బహిష్కరణ చేయడం జరుగుతుందని, కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago