బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు
రెండు వారాల పాటు మార్గదర్శనం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
వియత్నాంలోని హోచి మిన్ సిటీ, ట్రూంగ్ కావో డాంగ్ వియెన్ డాంగ్ లో జరిగే కృత్రిమ మేధస్సు లాంచ్ ప్యాడ్ బ్యూట్ క్యాంపుకు మెంటర్, రిసోర్స్ పర్సన్ గా సేవలందించేందుకు గీతం అధ్యాపకుడిని ఆహ్వానించారు. గీతం స్కూల్ ఆఫ్ సీఎస్ఈ లోని ఏఐ & డీఎస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నిరంజన్ అప్పస్వామి, జూన్ 22 నుంచి జూలై 4 వరకు వియత్నాంలో పర్యటిస్తున్నారు. ఈ రెండు వారాల అంతర్జాతీయ విద్యా కార్యక్రమం, గీతం అధ్యాపకుల నైపుణ్యానికి, విద్యా నాయకత్వానికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపును ప్రతిబింబిస్తుంది.వియెన్ డాంగ్ లో డాక్టర్ నిరంజన్ అప్పస్వామి పాల్గొనడం ఇది ఆరవసారి. ఇది ఈ రెండు సంస్థల మధ్య సహకార సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ఆయన అందించిన నైపుణ్యాన్ని, కృషిని గుర్తించి, వియత్నాంలోని విద్యార్థులతో తన జ్జానాన్ని, అనుభవాన్ని పంచుకోవడానికి గీతం నాయకత్వం ఆయనను అనుమతించింది.
72 గంటల ఆచరణాత్మక శిక్షణతో కూడిన ఏఐ లాంచ్ ప్యాడ్ బూట్ క్యాంప్, విద్యార్థులకు కృత్రిమ మేధస్సును ప్రాథమిక స్థాయి నుంచి పరిచయం చేయడానికి రూపొందించారు. దీని ద్వారా వారు కోడింగ్ లేదా గణితంలో విస్తృతమైన ముందస్తు పరిజ్జానం అవసరం లేకుండానే వాస్తవ ప్రపంచ ఏఐ అప్లికేషన్లను నిర్మించగలుగుతారు. ఓపెన్-సోర్స్ సాధనాలు, ఆచరణాత్మక అనువర్తనాల ద్వారా అనుభవపూర్వక అభ్యాసానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తుంది.ఈ బ్యూట్ క్యాంప్ పాఠ్య ప్రణాళిక నాలుగు అభ్యాస దశలుగా విభజించారు. ఏఐ ప్రాథమిక సూత్రాలు (విజువల్ లెర్నింగ్ – కోడింగ్ అవసరం లేదు), పైథాన్, మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్, ప్రాక్టికల్ ఏఐ అప్లికేషన్స్, ఏఐ ప్రాజెక్ట్ డెవలప్ మెంట్, డిప్లాయిమెంట్ వంటివి. ఈ మాడ్యూల్స్ ద్వారా, ఈ బూట్ క్యాంపులో పాల్గొనేవారు వాస్తవ-ప్రపంచ ఏఐ పరిష్కారాలను నిర్మించడం, పరీక్షించడం, అమలు చేయడంలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు.
డాక్టర్ నిరంజన్ అప్పస్వామి ఒక విశిష్ట సైబర్ సెక్యూరిటీ పరిజ్జాన నిపుణుడు, అంతర్జాతీయ విద్యావేత్త, అకడమిక్ సభ్యుడు. ఆయన ఇప్పటివరకు 22 పాఠ్య పుస్తకాలను రచించారు. ప్రస్తుతం ఐ ట్రిపుల్ ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషల్ టెక్నికల్ కమ్యూనిటీ (ఎస్టీసీ)కి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన లింక్డ్ ఇన్ యొక్క ‘ది సైబర్ డిఫెండర్’, ‘టీచింగ్ బియాండ్ ది టెక్ట్స్ బుక్’ న్యూస్ లెటర్లకు సంపాదకుడిగా కూడా ఉన్నారు. అంతేగాక, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బాగా పట్టు సాధించి, ప్రముఖ వక్తగా పేరు పొందారు.డాక్టర్ నిరంజన్ అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాన్ని గీతం నాయకత్వం ప్రశంసించింది. ఇటువంటి అవకాశాలు అధ్యాపక సభ్యుల నైపుణ్యాన్ని, విజయాలను గుర్తించడమే కాకుండా, విశ్వవిద్యాలయం యొక్క ప్రపంచవ్యాప్త గుర్తింపును, విద్యా ప్రతిష్టను కూడా పెంచుతాయని అభిలషిస్తున్నారు. అంతర్జాతీయ సహకారాలను పెంపొందించడానికి, బోధన, పరిశోధన, ఆవిష్కరణలలో శ్రేష్ఠతను ప్రోత్సహించడానికి గీతం నిబద్ధతను ఇది తెలియజేస్తోంది.
పటాన్‌చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…
కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కార్మిక శాఖ చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తాం సిఐటియు…
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి ఈనెల 30న కళాశాలల బహిష్కరణ బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్‌లో రెండో షోరూమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్: పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ…