Telangana

పార్కులు ప్రజల ఆరోగ్యానికి భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్:

పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటి శిల్ప లేఔట్ కాలనీ, పిఎన్ఆర్ కాలనీలలో ఒక కోటి 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో గల ప్రతి పార్కు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పార్కుల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో పాటు పచ్చదనం పెరగడంతో పాటు కాలనీలలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలిపారు. ప్రతి పార్కులో పిల్లలకు ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ సురేష్, డి ఈ వెంకటరమణ, పార్కుల విభాగం మేనేజర్ సతీష్, మాజీ కౌన్సిలర్లు ఉపేందర్ రెడ్డి, గోపాల్, జగదీష్, కృష్ణ, మహదేవ రెడ్డి, రాములు, బిజిలి రాజు, కాట సునీత, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago