Categories: politics

కూకట్ పల్లి లో కాల్పుల కలకలం….

కూకట్ పల్లి లో కాల్పుల కలకలం….

హైదరాబాద్ :

కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా, ఆ సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Venu

Recent Posts

ఆధునిక వాస్తవిక కల్పన నవల

గీతం కీలకోపన్యాసంలో పేర్కొన్న జేఎన్ యూ ఆచార్యుడు ప్రొఫెసర్ ఉదయ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భారతీయ నవల,…

13 hours ago

క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం_ పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు ఆలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

1 day ago

గీతంలో భారత సాహిత్య సంస్కృతులపై చర్చాగోష్ఠి

దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రసిద్ధ ప్రొఫెసర్లు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్…

1 day ago

కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీ నటి ప్రియాంక మోహన్‌

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుషల్స్ ఆభరణాలు సంప్రదాయం, ఆధునిక డిజైన్‌ను అందంగా సమతుల్యం చేస్తాయి అని నటి…

3 days ago

మహాత్మా గాంధీ పేరు యథాతథంగా కొనసాగించాలి_సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ…

3 days ago

రసాయన శాస్త్రంలో ఎస్.డి.భవానీకి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎస్.డి.భవానీ…

3 days ago