సమ్మక్క సారలమ్మ కృపతో ప్రజలందరూ చల్లగా ఉండాలి
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్:
సమ్మక్క సారలమ్మల కృపతో పటాన్‌చెరునియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బంధం కొమ్ములో గల సమ్మక్క సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు పాల్గొని అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనం పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం వెళ్లలేని భక్తుల కోసం బంధం కొమ్ములో స్వయం భూగ వెలసిన అమ్మవార్లకు ప్రత్యేక గద్దెలు నిర్మించి గత రెండు దశాబ్దాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…