politics

అంతా గణితమయం ! ‘

మనవార్తలు ,పటాన్ చెరు:

_గీతమ్ ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు

మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలన్నీ గణితమయం అని, ప్రతిదానిలో గణితం ఉండడం వల్లే అది మన జీవితాలను సులభతరం చేస్తోందని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సీహెచ్ గోపాలరెడ్డి అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం అనే అంశంపై శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గణితశాస్త్ర సంఘం ( ఏపీటీఎస్ఎంఎస్ ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ కార్యక్రమాన్ని గణిత శాస్త్ర విభాగం ఏర్పాటు చేసింది. గణితశాస్త్రం స్వచ్ఛమైన ఆలోచనా కళగా, అదే సమయంలో విశ్వవ్యాప్తంగా వర్తించే శాస్త్రంగా విశిష్ట స్థానం సంతరించు కుందని ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి చెప్పారు. గణితం చాలా అధునాతనమైన సాధనంగా అభివృద్ధి చెందిందని, చాలామంది ప్రజలు తమ జీవితాలలో దాని సర్వవ్యాప్తిని కూడా గుర్తించలేరన్నారు.

జీవశాస్త్రం , ఆరోగ్య పరిరక్షణ , కామర్స్, వ్యాపార రంగాలలో కూడా గణితాన్ని వినియోగిస్తారని, అసలు గణితాన్ని ఉపయోగించకుండా సాంకేతికతను ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాచీన భారతంలో సున్నాను కనుగొన్నారని, గణిత జ్ఞానాన్ని ఉపయోగించే గ్రహణ సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తూ పంచాంగాలు రాస్తారని చెప్పారు. జ్యోతిషశాస్త్రం నుంచి ఖగోళశాస్త్రం వరకూ గణితమే ఆవరించి ఉందని డాక్టర్ గోపాలరెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీటీఎస్ఎంఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.కిషన్ మాట్లాడుతూ, గణితం, వాస్తవిక సమస్యలు లేకుండా సైన్స్డ్, ఇంజనీరింగ్ శాస్త్రీయంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదన్నారు. తమ సంస్థ ఆవిర్భావం, అది నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఆయన వివరించారు. తదుపరి పరిశోధనా రంగాలను గుర్తించేందుకు ఈ మూడు రోజుల సదస్సు ఉపకరిస్తుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సదస్సు సావనీర్ ను విడుదల చేసి, అతిథులను సత్కరించారు. ఇంజనీర్లు గణితాన్ని తప్పనిసరిగా నేర్చుకోవలసి వస్తోందని, గణిత జ్ఞానం లేకుండా వారు పెద్దగా అభివృద్ధి సాధించలేరని ఐఐటీ ఖరగ్‌పూర్ డీన్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ మూడు రోజుల సదస్సులో దాదాపు రెండు వందల మంది దేశ నలుమూలల నుంచి తమ పరిశోధనా పత్రాలను సమర్పించినట్టు నిర్వాహకుడు ప్రొఫెసర్ బీఎం నాయుడు తెలియజేశారు. మరో కన్వీనర్ డాక్టర్ శివారెడ్డి శేరి వందన సమర్పణ చేశారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె నగేషా, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ పి.నరసింహస్వామి, డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గీతమ్ లో ఘనంగా కాళోజీ జయంతి

కాళోజీ నారాయణరావు 108 వ జయంతిని శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కవిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ప్రజా కవిగా పేరొందిన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం విదితమే. గీతమ్ లో నెలకొల్పిన కాళోజీ నారాయణరావు విగ్రహానికి అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు ఘన నివాళులు అర్పించారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago