మనవార్తలు ,పటాన్ చెరు:
సంతోషమే సగం బలమని , ఏ కార్యాన్ని అయినా చిరునవ్వుతో , ఎటువంటి ఆందోళనకు తావివ్వకుండా చేపడితే విజయం సాధించడం తథ్యమని ప్రముఖ నవలా సినీ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు . హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ మేథస్సును పెంపొందించుకోవడం – జ్ఞాపకశక్తి ‘ ( డెవలపింగ్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ పవర్ ) అనే అంశంపై గురువారం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . ఆది నుంచి అంతం వరకు ఎంతో ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్యం కోరికలు , చూసేవారు ప్రదర్శకుల గురించి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ , మనస్సు – హృదయం ఏకకాలంలో ఆజ్ఞలను ఎలా ప్రసారం చేస్తాయో , ఒక వ్యక్తి సరెన వెఖరిని తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు .
సరైన సమయంలో పోటీలో ఇతరులను అధిగమించడానికి ఏకాగ్రత , జ్ఞాపకశక్తిని పెంపొందించడం చాలా అవసరమని చెబుతూ , ఒక వ్యక్తిలో ఏకాగ్రత లోపానికి గల వివిధ కారణాలప్పై విడమరచి చెప్పారు . అందరిలో మంచివాడు అనిపించుకోవడం కంటే తెలివి తక్కువ మరొకటి లేదని డాక్టర్ యండమూరి స్పష్టీకరించారు . ఈ రోజు ఆనందంగా ఉండడం , రేపు కూడా ఆనందంగా ఉండగలను అనుకోవడమే విజయంగా ఆయన అభివర్ణించారు . పెంపుడు జంతువులపై ప్రదర్శించే ప్రేమను కూడా తాతలు , అమ్మమ్మ , నాయనమ్మలపై ప్రదర్శించడంలేదని , స్పర్శ ద్వారా ప్రేమను ప్రకటించడం ఉత్తమమని పేర్కొన్నారు . ఏదైనా నొప్పితో వారు బాధపడుతుంటే ఆత్మీయ స్పర్శతో లేపనాన్ని రాస్తే త్వరిత ఉపశమనం లభిస్తుందని , అది అనుభవం ద్వారానే బోధపడుతుందన్నారు . తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు కొంత సమయం కేటాయించాలని , అరమరిక లేని బంధాన్ని వారితో ఏర్పరచుకుంటే చాలా సమస్యలు వాటంతట అనే పరిష్కారమవుతాయని డాక్టర్ యండమూరి స్పష్టీకరించారు .
మనందరం ఒకేలా తల్లి గర్భం నుంచి ఉద్భవించినా , రకరకాల ముసుగులు ధరిస్తామని , కొంతమంది ఉత్సాహంగా , మరికొందరు నిరుత్సాహంగా , పేలవంగా ఉంటారని అదే మన వ్యక్తిత్వమని వ్యక్తిత్వ వికాస నిపుణుడెన వీరేంద్రనాథ్ పేర్కొన్నారు . విద్యార్థుల ఉత్సాహాన్ని కొనసాగించడానికి కొన్ని ప్రశ్నలడిగి , సరైన జవాబులిచ్చిన వారికి తక్షణమే బహుమతులు ప్రదానం చేశారు . తన ప్రశ్నావళికి సరైన జవాబులిచ్చిన విద్యార్థులను వేదికపైకి ఆహ్వానించి , అందరికీ బహుమతులు ఇవ్వడమే కాకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బంగారు పతకం , ప్రశంసా పత్రాలను బహుకరించారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి సత్కరించారు . విజయ్ ఈవెంట్స్ అధినేత శ్రీ విజయరామరాజు , వివిధ విభాగాధిపతులు , అధ్యాపకులు , తొలి ఏడాది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…