దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ
ఇస్నాపూర్ లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం
హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాధవానంద సరస్వతి హాజరై భక్తులకు ఆశీర్వాదం అందించారు.ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయట పడటానికి ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆలయాల నిర్మాణానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్,ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు మన్నె రాఘవేందర్, ఊళ్ళ శంకర్, పెంటయ్య, యాదగిరి, రవి, రాజు, మణికంఠ, పాండు, వి నారాయణరెడ్డి, అశోక్, పాండు, సుధాకర్, ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…