Telangana

వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను నేటి తరాలకు తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ద్విసప్తహ కార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం ప‌టాన్ చెరు డివిజన్ కృషి డిఫెన్స్ కాలనీలోనీ ఫ్రీడం పార్కులో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ లతో కలిసి 75 మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఫ్రీడం పార్కులో 75 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేయడంతో పాటు, మహనీయుల త్యాగాలనుస్మరిస్తూ కరపత్రాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

_తిరంగా ర్యాలీలను జయప్రదం చేయండి

స్వతంత్ర భారత వజ్రోత్సవ భాగంగా ఈనెల 11, 13 తేదీలలో నిర్వహించనున్న ఫ్రీడం రన్, తిరంగా ర్యాలీలను జయప్రదం చేయాలని జిఎంఆర్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని కోరారు. బుధవారం ఎంపీడీవో సమావేశ మందిరంలో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వత్రోత్సవాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ఈనెల 11, 13 తేదీలలో నిర్వహించనున్న ర్యాలీలలో టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలను త్రివన్న రంగుల దీపాలతో అలంకరించాలని కోరారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాద్, మండల విద్యాధికారి రాథోడ్, ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాఘవేందర్ రెడ్డి,ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago