politics

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి
– నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
– డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

పటాన్ చెరు:

పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర అంశాలను స్థానిక ఉప కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ నగరాన్ని గ్రీన్ హైదరాబాద్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని అన్నారు. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పట్టణంలో పరిశుభ్రత పరవాలేదని, మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పట్టణ ప్రజలందరూ చెత్తను జీహెచ్ఎంసీ ఆటోలోనే వేయాలని తెలిపారు. చెత్తను తీసుకువెళ్లేందుకు ఆటో వారికి మీకు తోచిన విధంగా డబ్బులు ఇవ్వాలని సూచించారు.

అనంతరం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ డివిజన్ పరిధిలోని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. పారిశుధ్య కర్మికుల సిబ్బంది కొరతను వివరించారు. ఇంతకు ముందు బండ్లగూడ గ్రామం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా 2 సంవత్సరాల క్రితం పటాన్ చెరు డివిజన్ లో విలీనం చేయడం జరిగింది. కావున తగినంత సిబ్బందిని నియమించాలని కోరారు. నూతనంగా కలిసిన బండ్లగూడ గ్రామంతో చెత్త సేకరణకు తగినన్ని వాహనాలు లేవని కాబట్టి పారిశుధ్య పనులు సజావుగా సాగేందుకు 30 స్వచ్చ ఆటోలను, 20 స్వచ్చ రిక్షాలను, 30 చెత్త తోపుడు బండ్లు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

బండ్లగూడ గ్రామానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. బండ్లగూడ గ్రామం డివిజన్ లో విలలీనమయినప్పటికి అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పాత వేతనం రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని, కావున పటాన్ చెరు లోని పారిశుధ్య కార్మికులతో పాటు సమానవేతనం రూ.17 వేలు మంజూరు చేయగలరని వినతి పత్రం అందజేశారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలో దేశం లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని అందులో కార్మికులే ఎక్కువగా ఉన్నందున వారు తమ పనులకు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటి బస్ స్టాండ్ కు వెళ్ళవలసి వస్తుంది.

ఇలా రోడ్డు దాటే క్రమంలో చాలామంది ప్రమాదాలకు గురైయ్యారని, ప్రాణాలు కూడా కోల్పోయారు. కావున బస్ స్టాండ్ పరిధిలో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నియమిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారవుతారని మేయర్ కు కార్పొరేటర్ విన్నవించారు. డివిజన్ లోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ మేయర్ ఇచ్చారు. మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ బాలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు అఫ్జల్, టిఆర్ఎస్ నాయకుడు సందీప్ తదితరులు ఉన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago