పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిన్నారం మండలంలోని ఖజిపల్లి గ్రామంలో నిర్వహించిన పటాన్‌చెరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు హరితహారం కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు .అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్‌చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చదనం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంపొందించాలని,అలాగే కాలుష్య నివారణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ల్ రాములు, శ్రీనివాస్ , సత్యనారాయణ ,గ్రామ సర్పంచ్, నవీన్, ఎక్స్ సర్పంచ్ ,శ్రీనివాస్ , . సురేష్ వార్డ్ మెంబర్ , టి శ్రీనివాస్ గౌడ్ , గౌడ్ సంగం వైస్ ప్రెసిడెంట్,ఎం చిన్న వెంకన్న గౌడ్ ,ఎం రాజు గౌడ్ ,ఎం అరుణ్ గౌడ్, జనార్ధన్ టి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…