Hyderabad

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి…

-జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్

హైదరాబాాద్:
జీవ వైవిధ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌ అన్నారు. ప్రతి ఏడాది మే 22 వతేదీ అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ జీవ వైద్య మండలి, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను  హైదరాబాద్ లాక్డికపూల్‌లోని అరణ్య భవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిద్య మండలి కార్యదర్శి కాళీ చరణ్‌, సాగర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సీఇఓ  జోగి రితేష్ వెంకట్, అధికారులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. “
మనం పరిష్కారంలో భాగస్వామ్యులం” అనే అంశంతో ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్నట్లు కాళీచరణ్‌ తెలిపారు. జీవి వైవిద్యం అనేది వాతావరణం, ఆరోగ్య సమస్యలు, ఆహారం, నీటి భద్రత, స్థిరమైన జీవనోనపాధికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు తిరిగి నిర్మించగల పునాది అని అన్నారు. జూనియర్‌, సీనియర్‌ అనే రెండో విభాగాల్లో 9 అంశాలతో ఈ పోటీలు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, వ్యాసరచన, ప్రసంగం, నృత్యం, కార్టూన్‌ డిజైన్‌, క్విజ్‌, ఫ్యాన్సీడ్రెస్‌ ఇలా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మే 20 తేదీ లోపు www.tsepbr.org/pbr_event, facebook.com/tsbiodiversity అనే వైబ్‌సైట్‌ ద్వారా పేర్లును నమోదు చేసుకోవాలని కాళీ చరణ్ సూచించారు.
Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago