జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్..
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్‌చెరుశాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పటాన్‌చెరులోని తన నివాసంలో స్వీయ జన గణనను ప్రారంభించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని.. ఖచ్చితమైన వివరాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా జనగణన ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. ప్రజలు యాప్ ద్వారా స్వీయ జనగణన సైతం చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు ఇళ్లకు వచ్చిన సమయంలో పూర్తి వివరాలు అందించాలని.. ఎటువంటి గోప్యతకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల జీవన స్థాయి ప్రమాణాలు, వెనుకబాటుతనం, విద్య స్థాయి, తదితర అంశాల పైన స్పష్టమైన సమాచారం లభిస్తుందన్నారు. ప్రజలు అందించే ప్రతి సమాచారం పూర్తి భద్రతతో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఏ ఆర్ ఓ అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…