_కార్మికుల చెంతకు అత్యధునిక వైద్య సేవలు
మనవార్తలు ,రామచంద్రాపురం:
ఆసియాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరునియోజకవర్గంలోని కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులను బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో 80% మంది కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారని, వారందరి కోసం ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల శస్త్ర చికిత్సలతో పాటు, నిపుణులైన వైద్యులు నియమించడం జరిగిందన్నారు.ఆసుపత్రి ఆధునీకరణకు సంపూర్ణ సహకారం అందించిన మంత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వివిధ వైద్య చికిత్సల కోసం కోసం వచ్చే కార్మికులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించకూడదని వైద్యులను కోరారు.ప్రభుత్వ తరఫున అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.పటాన్ చెరులో ఏర్పాటు చేయబోతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండబోతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…