ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు...
హైదరాబాద్:
26 ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం సాయంత్రం వరకు మొత్తం 1,56,526 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ 1,06,506, మెడికల్ 50,020 దరఖాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులకు జూలై 5, 6న మూడు విడతల్లో, ఇంజనీరింగ్ విద్యార్థులకు జూలై 7, 8, 9 తేదీల్లో ఐదు విడతల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…