Telangana

మార్పును అందిపుచ్చుకోండి

వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులకు ప్రొఫెసర్ కరుణాకర్ సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ 5.0 దిశగా పయనిస్తున్న ఈ తరుణంలో వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్ అపారమైన మార్పులకు గురైందని, ఆ మార్పును అందిపుచ్చుకుని విజయ తీరాలను చేరుకోవాలని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) సెంటర్ ఫర్ కేస్ స్టడీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి సూచించారు. జీఎస్బీలోని మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యాపార వృద్ధి కోసం సామాజిక-వాణిజ్యంలో కత్రిమ మేధస్సును ప్రభావంతంగా వినియోగించడం’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (ఎండీపీ)ని గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ సహా ఆటోమేషన్, రోబోటిక్స్ సాంప్రదాయ వ్యాపార నమూనాలను సమూలంగా మారుస్తున్నాయన్నారు. ఆయా అంశాలపై మంచి అవగాహన కల్సించేందుకు ఏర్పాటుచేసిన ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులు, మార్కెటర్లు, మేనేజర్లు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా, అనధికారిక రంగాలలో పనిచేస్తున్న వారితో సహా విభిన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ యాజమాన్య వికాస కార్యక్రమాన్ని రూపొందించారు. ఏఐ వారి సామాజిక-వాణిజ్య వ్యూహాలను ఎలా విప్లవాత్మకంగా మార్చగలదో, సంబంధిత సంస్థలలో స్థిరమైన వృద్ధిని వారు ఎలా సాధించగలరో ఈ కార్యక్రమంలో వివరిస్తారు. వ్యాపార కార్యకలాపాలను వృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్జానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగనున్నది. ఇందులో పాల్గొన్న వారికి ఆయా అంశాలపై విస్తృత అవగాహన ఏర్పరచడమే గాక, ఇతర సంస్థల ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవడానికి కూడా ఉపకరిస్తోంది.ఈ ప్రారంభోత్సవంలో ఎండీపీ నిర్వాహకుడు ప్రొఫెసర్ యు.దేవీప్రసాద్, మార్కెటింగ్ చైర్ డాక్టర్ దేవిక రాణి శర్మ, పలువురు అధ్యాపకులు, దాదాపు 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago