politics

పీజీఎన్ఏఏతో మాదక ద్రవ్యాలను గుర్తించవచ్చు : బార్క్ శాస్త్రవేత్త

మనవార్తలు ,పటాన్‌చెరు:

ప్రాంప్ట్ గామా – రే న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్ ( పీజీఎన్ఏఏఏ ) ద్వారా వివిధ మాదక ద్రవ్యాలు , మందు పాతరలు , పేలుడు పదార్థాలతో పాటు లోహాలు , బొగ్గు ( ఖనిజాలు ) , సిమెంట్ , రేడియో ధార్మిక పదార్థాల వంటి వాటిని గుర్తించవచ్చని భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) రేడియోఎనలిటిక్స్ కెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎస్ రామాంజనేయులు చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో బుధవారం ఆయన ‘ పరిశోధనలో రేడియో ఎనలిటికల్ పద్ధతుల వినియోగం’పై ఉపన్యసించారు . పీజీఎన్ఏఏఏ సాంకేతికను ప్రయోగశాలలో లేదా వివిధ నమూనాలను ఆన్ – సెట్ విశ్లేషణ కోసం ఉపయోగించ వచ్చన్నారు .

భద్రత , రసాయన , పదార్థ , భూగర్భ , పురావస్తు శాస్త్రాలతో పాటు పరిశ్రమ , వ్యవసాయం , పర్యావరణం , జీవశాస్త్రం వంటి రంగాలలో అణు సాంకేతికతతో గుణాత్మక , పరిమాణాత్మక మూలకాలను ఉపయోగించి వివిధ రకాలుగా వినియోగించడానికి పీజీఎన్ఏఏఏ ప్రక్రియ ఉపకరిస్తుందని డాక్టర్ రామాంజనేయులు వివరించారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులివ్వడమే కాకుండా , వారి నుంచి కొత్త అంశాలను తెలుసుకుంటున్నట్టు చమత్కరించారు . ఆ తరువాత ఇతర శాస్త్రవేత్తలు డాక్టర్ మాధవ బి.మల్లియా , డాక్టర్ ధనదీప్ దత్తాలు కూడా ఇతర అంశాలపై ఉపన్యాసాలిచ్చారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల , గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , డాక్టర్ నరేష్ కుమార్ కటారి తదితరులు బార్క్ శాస్త్రవేత్తలను సత్కరించారు . ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు ( శుక్రవారం వరకు కొనసాగనున్నది .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago