Districts

డబుల్ బెడ్ రూం ఇళ్ళ‌నుఅర్హులకు కేటాయించాలి- భారతీయ జనతా పార్టీ పటాన్ చెరువు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య

-సంగారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బీజేపీ శ్రేణుల

మనవార్తలు , సంగారెడ్డి:

ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళ‌ను అర్హుల‌కు కేటాయించాల‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ప‌టాన్ చెరు మండ‌ల అధ్య‌క్షులు ఈశ్వ‌ర‌య్య డిమాండ్ చేశారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను వెంటనే నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేద స్థానికులకు కేటాయించాల‌ని సంగారెడ్డి క‌లెక్ట‌ర్ కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన స్థానిక‌, స్థానికేతర నిరుపేదలందరికి కేటాయించాలన్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం సైతం నిధులు అందించింద‌న్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి పటాన్చెరు లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని అన్నారు సిఫారసుల‌తో కాకుండా స్థానికంగా , స్థానికేత‌ర నిరుపేద‌లంద‌రికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళు ద‌క్కేలా క‌లెక్ట‌ర్ చొర‌వ‌చూపాలని ప‌టాన్ చెరు మండ‌ల అధ్య‌క్షులు ఈశ్వ‌ర‌య్య విజ్ఞప్తి చేశారు .

ఈ‌ కార్యక్రమంలో పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ గారు,పటాన్ చేరు బిజెపి ప్రధాన కార్యదర్శి విరేశం గారు, కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు వీరారెడ్డి గారు, బొల్లారం మున్సిపల్ అధ్యక్షుడు భారత్ చారి గారు, ఆర్.సి.పుర్ డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీకాంత్ గారు, బిజెపి ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్ గారు, బొల్లారం కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు అంగడి బాల్ రాజు గారు, పటాన్ చేరు మండల్ దళిత మోర్చ అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, బొల్లారం బిజెపి ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

19 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

21 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago