మనవార్తలు , శేరిలింగంపల్లి :
తలనొప్పి,తల తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతున్న మహిళకు మియాపూర్ మాతృశ్రీ నగర్ లోని మెడికేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి మెదడులోని కణితి ని తొలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వైద్యులు వివరాలను వెల్లడించారు డాక్టర్లు. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన విజయ చాలాకాలంగా తల తిరగడం, తలనొప్పి ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చూపించుకుని ఆపరేషన్ చేయించుకున్నా ప్రయోజనం లేకుండా పొయింది.అయితే ఇటీవల మియాపూర్ మాతృశ్రీనగర్ లో ఉన్న మెడికేర్ ఆస్పత్రిలో చేరిన పేషెంట్ విజయకు ఆస్పత్రిలో న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రసాద్, అనస్తీషియా డాక్టర్ హరికృష్ణలు రోగిని పరిశీలించి ఆమె మెదడులో 6.6 సెంటీమీటర్లు(మెదడులో నాలుగవ వంతు భాగం) కణతి ఉన్నట్లు నిర్దారించారు. ఆమెకు సుమారు 5 నుండి 6 గంటల పాటు శ్రమించి ఆ కణతిని తొలగించారు. ప్రస్తుతం పేషేంట్ విజయ ఆరోగ్యంగా ఉందని, మెడికేర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ రాజు తెలిపారు.ఈ వ్యాధి లక్ష మందిలో ఇద్దరి వస్తుంది అన్ని న్యూరో సర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, కార్పొరేట్ ఆస్పత్రి అయినా అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పేషేంట్ విజయ, డాక్టర్ల బృందం పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…