Districts

పీసీ ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు:

ఎస్ఆర్ఆర్ స్ట్రక్చర్లతో ఎల్ యాంటెన్నా రూపకల్పన , వినియోగాలపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పీసీ ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . నూతన ఫ్రీక్వెన్సీ రీకాన్ఫిగరబుల్ సర్క్యులర్ పోలరెజ్ డ్యూయల్ ఫోల్డెడ్ ఇన్వర్టెడ్ – ఎస్ఆర్ఆర్ స్ట్రక్చర్లతో ఎల్ యాంటెన్నా ప్రతిపాదించి , రూపొందించినట్టు ఆయన తెలిపారు .

ఇది మంచి బ్యాండ్విడ్తో పాటు రేడియేషన్ లక్షణాలను సాధించిందన్నారు . దీనితోపాటు కో  యాక్సియల్ ప్రోబ్ ఫీడ్ టెక్నిక్తో బ్రాడ్సెడ్ కపుల్డ్ స్పిట్  రింగ్ రెసొనేటరీ ( బీసీ – ఎస్ఆర్ఆర్ ) నిర్మాణాలతో డీఎఫ్ఎఎల్ఎ యాంటెన్నాను కూడా ప్రతిపాదించినట్టు తెలిపారు . ఈ ప్రతిపాదిత యాంటెన్నాలు ఎస్ఆర్ఆర్ ఆకారం , స్థానాన్ని సవరించడం ద్వారా ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీలను ట్యూన్ చేసేలా రూపొందించామని , ఫ్రీక్వెన్సీ రీ – కాన్ఫిగరబిలిటీ కూడా తయారు చేశామన్నారు . వీటన్నింటినీ విశ్లేషించగా , కల్పిత యాంటెన్నా ఫలితాలు , హెచ్ఎఫ్ఎస్ఎస్ అనుకరణ ఫలితాలు అన్ని పారామితులకు మెరుగైన సహసంబంధాన్ని అందించినట్టు ప్రొఫెసర్ త్రినాథరావు తెలియజేశారు .

ప్రవీణ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago