_గ్రామీణ స్థాయిలో క్రీడా రంగానికి సంపూర్ణ సహకారం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ స్థాయి నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని, ఇందుకు అనుగుణంగా క్రీడాకారుల కోసం 38వేల రూపాయలతో క్రీడా పరికరాలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరుగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 122 తెలంగాణ క్రీడా రంగనాలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వం అందించిన క్రీడా పరికరాల ద్వారా విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాలని విజ్ఞప్తి చేశారు.పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడానంగం అభివృద్ధి కోసం ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…